Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాపై 21పరుగుల తేడాతో పాక్ గెలుపు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న టి20 ట్రై సిరీస్‌లో పాకిస్తాన్ జట్టు తొలి విజయాన్ని సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాక్ 21పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 167పరుగులు చేసింది. ఓపెనర్, వికెట్ కీపర్ రిజ్వాన్(78), కెప్టెన్ బాబర్ అజామ్(22), మసూద్(31) బ్యాటింగ్‌లో రాణించారు. తస్కిన్‌కు రెండు, మహ్మద్, నసూమ్, మెహిదీకు తలా ఒక వికెట్ లభించాయి. ఛేదనలో బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 8వికెట్లు కోల్పోయి 146పరుగులే చేయగల్గింది. లింటన్ దాస్(35), హొసైన్(25), యాసిర్ అలీ(42) బ్యాటింగ్‌లో రాణించారు. మహ్మద్ వాసీం జూనియర్‌కు మూడు, మహ్మద్ నవాజ్‌కు రెండు, షహనాజ్, రవూఫ్, షాదాబ్‌కు తలా ఒక వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రిజ్వాన్‌కు లభించగా.. నేడు న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.