Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్విమ్మింగ్‌లో సాజన్, హషికకు పసిడి
- 36వ జాతీయ క్రీడలు
అహ్మదాబాద్: 36వ జాతీయ క్రీడల్లో శుక్రవారం జూడో మహిళల విభాగంలో ఢిల్లీకి చెందిన తులిక మాన్కు స్వర్ణ పతకం లభించింది. కామన్వెల్ క్రీడల రజత పతక విజేత తులిక మాన్ 78+ కేటగిరీ ఫైనల్లో పంజాబ్‌కు చెందిన కన్వర్ప్రీత్ కౌర్‌ను ఓడించింది. పురుషుల 66కిలోల కేటగిరీలో రోమెన్ సింగ్(సర్వీసెస్) ఢిల్లీకి చెందిన ఆయుష్ మన్వారీని ఓడించి బంగారు పతకాన్ని సాధించాడు. 60కిలోల విభాగంలో యుపికి చెందిన విజరు యాదవ్ స్వర్ణాలు గెలుపొందగా.. మహిళల 63కిలోల కేటగిరీలో మణిపూర్‌కు చెందిన సునిబాలదేవి ఫైనల్లో ఢిల్లీకి చెందిన మేఘా టోకాస్ను ఓడించింది.
స్విమ్మింగ్‌లో సాజన్ ప్రకాశ్ రికార్డు..
పురుషుల 200మీ. స్విమ్మింగ్ మిడ్లేలో సాజన్ ప్రకాశ్ రికార్డు నమోదు చేశాడు. సాజన్ 2నిమిషాల 05.81సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణం గెలుచుకోగా.. కర్ణాటకు చెందిన శివ(2:07.47సెకన్లు), తమిళనాడుకు చెందిన రోహిత్(2నిమిషాల 08.66సెకన్లు) రజత కాంస్య పతకాలను సాధించారు. మహిళల 400మీ. ఫ్రిస్టైల్లో హషిక రామచంద్ర(కర్ణాటక), 400మీ. ఫ్రిస్టైల్ విభాగంలో కేరళకు చెందిన సాజన్ ప్రకాశ్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. ఇక 4×100మీ. మిక్స్డ్ ఫ్రిస్టైల్ రిలేలో కర్ణాటక 3నిమిషాల 44:62సెకన్ల స్వర్ణ పతకం సాధించగా.. మహరాష్ట్ర(3:47.81సెకన్లు), తమిళనాడు(3:50.74సెకన్లు) రజత, కాంస్య పతకాలను సాధించాయి. మహిళల 50మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో గుజరాత్‌కు చెందిన మానా పటేల్ 29.77సెకన్లు మీట్ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకం సాధించగా.. రిథిమా కుమార్(కర్ణాటక) 30.13సెకన్లు, సగ్నిక్ రారు(పశ్చిమ బెంగాల్) 31.24సెకన్లు రజత, కాంస్య పతకాలను సాధించారు.