Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో టి20లోనూ గెలుపు
బ్రిస్బేన్: బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్, బౌలింగ్‌లో మిఛెల్ స్టార్క్ రాణించడంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో, చివరి టి20లో ఆస్ట్రేలియా జట్టు 31పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టి20ల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2-0తో కైవసం చేసుకొని క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 178పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్(75), టిమ్ డేవిడ్(42), వేడ్(16) బ్యాటింగ్‌లో రాణించారు. జోసెఫ్‌కు మూడు, ఓడెన్ స్మిత్‌కు ఒక వికెట్ దక్కాయి. అనంతరం విండీస్ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు కోల్పోయి 147పరుగులే చేయగల్గింది. ఛార్లెస్(29), కింగ్(23), హొసైన్(25) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. స్టార్క్(4/20) కెరీర్ బెస్ట్‌కి తోడు కమ్మిన్స్(2/32) బౌలింగ్‌లో రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ డేవిడ్ వార్నర్‌కు లభించాయి. తొలి టి20లో ఆసీస్ జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందగా.. ఇరుజట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ టి20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం నవంబర్ 30నుంచి ప్రారంభం కానుంది.