Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల ఆసియాకప్
ఢాకా: మహిళల ఆసియాకప్ టోర్నీలో భారతజట్టుకు తొలి పరాజయం ఎదురైంది. శుక్రవారం పాకిస్తాన్ చేతిలో భారత్ 13పరుగుల పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ మహిళలజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 137పరుగులు చేయగా.. ఛేదనలో భారత మహిళలజట్టు 19.4ఓవర్లలో 124పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ జట్టులో నిదా ధార్(56నాటౌట్), సొహైల్(32) బ్యాటింగ్‌లో రాణించారు. దీప్తికి మూడు, వస్త్రాకర్‌కు రెండు, రేణుకకు ఒక వికెట్ లభించాయి. ఛేదనలో టీమిండియా జట్టులో రీచా ఘోష్(26), హేమలత(20) మాత్రమే రాణించారు. సంధుకు మూడు, నిదా ధార్, ఇక్బాల్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నిదా ధార్‌కు లభించగా.. భారత మహిళల జట్టు నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
స్కోర్‌బోర్డు..
పాకిస్తాన్ మహిళల ఇన్నింగ్స్: మునీబా (స్టంప్)ఘోష్ (బి)దీప్తి 17, అమీన్ (సి)రీచా ఘోష్ (బి)పూజ 11, మరూఫ్ (సి)గైక్వాడ్ (బి)రేణుక 32, సొహైల్ (ఎల్బి)దీప్తి 0, నిదా ధార్ (నాటౌట్) 56, ఆలీయా రైజ్ (సి)మేఘన (బి)పూజ 7, అయేషా (సి)రోడ్రిగ్స్ (బి)దీప్తి 9, తుబా హసన్ (నాటౌట్) 1, అదనం 4. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 137పరుగులు.
వికెట్ల పతనం: 1/26, 2/33, 3/33, 4/109, 5/121, 6/135
బౌలింగ్: రేణుక 4-0-24-1, దీప్తి 4-0-27-3, పూజ 4-0-23-2, హేలత 2-0-21-0, గైక్వాడ్ 4-0-25-0, రాధా యాదవ్ 2-0-17-0
ఇండియా మహిళల ఇన్నింగ్స్: మేఘన (సి)అమీన్ (బి)సంధు 15, మంధాన (సి)అన్వర్ (బి)సందు 17, రోడ్రిగ్స్ (సి)తుబా హసన్ (బి)నిదా ధార్ 2, హేమలత (బి)తుబా హసన్ 20, పూజ (రనౌట్) నష్రా/మునీబ 5, దీప్తి (సి)అలీయా రైజ్ (బి)నిదా ధర్ 12, రీచా ఘోష్ (సి)అలియా రైజ్ (బి)సదియా ఇక్బాల్ 26, రాధా యాదవ్ (సి)అలీయా రైజ్ (బి)నష్రా సంధు 3, రేణుక (నాటౌట్) 2, గైక్వాడ్ (బి)అన్వర్ 1, అదనం 5. (19.4 ఓవర్లలో ఆలౌట్) 124పరుగులు.
వికెట్ల పతనం: 1/23, 2/29, 3/50, 4/63, 5/65, 6/91, 7/91, 8/110, 9/120, 10/124
బౌలింగ్: ఇక్బాల్ 4-0-24-2, నిదా ధార్ 4-0-23-2, నిష్రా సంధు 4-0-30-3, అన్వర్ 3.4-0-14-1, తుబా హసన్ 4-0-32-1.