Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం
న్యూఢిల్లీ : 36వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాల్సిన గోవా రాష్ట్రం ఏండ్లుగా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ రావటంతో.. విసుగుచెందిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అప్పటికప్పుడు గుజరాత్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుని సుదీర్ఘ విరామం అనంతరం జాతీయ క్రీడల నిర్వహణకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జాతీయ క్రీడల ఆతిథ్య హక్కులు దక్కించుకున్నప్పటికీ.. నిర్వహణ అంశంలో తీవ్ర అశ్రద్ధ వహించిన గోవా రాష్ట్రానికి ఐఓఏ మరో అవకాశం ఇచ్చింది. 37వ జాతీయ క్రీడల నిర్వహణ ఆతిథ్య హక్కులను గోవా రాష్ట్ర ఒలింపిక్ సంఘానికి అందించింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఓ ప్రకటనలో తెలిపింది. 2023, సెప్టెంబర్‌లో ఆసియా క్రీడలు షెడ్యూల్ చేశారు. ఆసియా క్రీడల షెడ్యూల్‌ను అనుసరించి, జాతీయ క్రీడల తేదిలను నిర్ణయించేందుకు ఐఓఏ తీర్మానించింది. అక్టోబర్ 12న, 36వ జాతీయ క్రీడల ముగింపు వేడుకల్లో క్రీడల బ్యాటన్‌ను గోవా రాష్ట్ర ఒలింపిక్ సంఘం అందుకోనుంది.