Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పష్టం చేసిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ
లసానె : ఈ ఏడాది డిసెంబర్లో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎన్నికలు నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అల్టిమేటం జారీ చేసింది. సెప్టెంబర్ 28న భారత ఒలింపిక్ సంఘం ఉన్నతాధికారులతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం అయిన సంగతి తెలిసిందే. భారత ఒలింపిక్ సంఘంలో నెలకొన్న పరిపాలన పరమైన సమస్యలపై చర్చించిన ఐఓసీ.. నూతన నిబంధనల ప్రకారం 2022, డిసెంబర్లోగా ఐఓఏ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించిన నూతన ఆఫీస్ బేరర్లను ఎన్నుకుంటేనే భారత ఒలింపిక్ సంఘం గుర్తింపు కొనసాగుతోంది. లేని పక్షంలో, సస్పెన్షన్ విధించటంతో పాటు, ఐఓసీ నిధులను సైతం నిలుపుదల చేస్తారు. ఈ సమావేశానికి ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా, సీనియర్ ఉపాధ్యక్షుడు సుమారివాల్ల, అథెట్ల ప్రతినిధిగా అభినవ్ బింద్రా హాజరయ్యారు.