Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థాయ్‌లాండ్‌తో భారత్ ఢ నేడు
- మహిళల ఆసియా కప్ 2022
సిల్హట్ (బంగ్లాదేశ్) : మహిళల 2022 ఆసియా కప్‌లో నేరుగా సెమీఫైనల్లోకి చేరుకునేందుకు నేడు టీమ్ ఇండియా రంగం సిద్ధం చేసుకుంటోంది. పదేండ్ల తర్వాత పొరుగు దేశం పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలైన హర్మన్‌ప్రీత్ సేన.. నేడు గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో తలపడనుంది. ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించిన పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చివరి మ్యాచ్‌లోనూ గెలుపొందితే, పది పాయింట్లతో ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్లోకి చేరుకోనుంది. గ్రూప్ దశలో పాకిస్థాన్‌పై మెరుపు విజయం సాధించిన థారులాండ్.. నేడు భారత్‌పై అటువంటిం సంచలనం కోసమే ప్రయత్నం చేయనుంది. భారత్, థాయ్‌లాండ్ పోరు నేడు మధ్యాహ్నాం 1 గంటలకు ఆరంభం కానుంది.
పాకిస్థాన్ చేతిలో భంగపడిన భారత్.. తర్వాతి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌పై గెలుపొంది మళ్లీ జోరందుకుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై అన్ని అస్త్రాలు ప్రయోగించనున్న భారత్.. సెమీఫైనల్స్‌కు సర్వ సన్నద్ధం అయ్యేందుకు ఎదురుచూస్తోంది. టాప్ ఆర్డర్లో స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగస్‌లు కీలకం కానున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధనాధన్ ఇన్నింగ్స్‌పై కన్నేసింది. తెలుగు తేజం సబ్బినేని మేఘనకు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కనుందని చెప్పవచ్చు!.