Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిసిన అలెక్స్ హేల్స్, బట్లర్
పెర్త్ (ఆస్ట్రేలియా) : పరుగుల పండుగలో ఆస్ట్రేలియా వెనుకంజ వేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముంగిట ద్వైపాక్షిక సిరీస్‌లో తొలి టీ20లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 209 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియాను 200/9 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లాండ్..8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 208/6 పరుగులు చేసింది. జోశ్ బట్లర్ (68, 32 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), అలెక్స్ హేల్స్ (84, 51 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. ఛేదనలో ఆసీస్ బ్యాటర్లు డెవిడ్ వార్నర్ (73), మిచెల్ మార్ష్ (36), మార్కస్ స్టోయినిస్ (35) మెరిసినా..వరుస వికెట్లతో ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. అలెక్స్ హేల్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. మూడు మ్యాచుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యం సాధించింది.