Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెరీర్ 90వ టైటిల్ కైవసం
అస్టానా (కజకిస్తాన్) : టెన్నిస్ స్టార్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ కెరీర్ 90వ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన అస్టానా ఏటీపీ ఫైనల్లో గ్రీసు కుర్రాడు స్టెఫానోస్ సిట్సిపాస్‌పై నొవాక్ జకోవిచ్ వరుస సెట్లలో విజయం సాధించాడు. 35 ఏండ్ల జకోవిచ్ ఫైనల్లో 6-3, 6-4తో 75 నిమిషాల్లోనే టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు నిరాకరించి మెగా టోర్నీలకు దూరమైన జకోవిక్ విరామ సమయంలో మరింతగా పుంజుకుని గొప్పగా పునరాగమనం చేస్తున్నాడు. 'కెరీర్లో ఇన్ని టైటిళ్లు సాధించగలగని అనుకున్నాను. నాకు తెలుసు నా కెరీర్ గొప్పగానే సాగుతుందని. ఇంకా ఎన్ని ఫైనల్స్ ఆడతానో తెలియదు. కానీ కచ్చితంగా టెన్నిస్‌లో గొప్ప శిఖరాలు అధిరోహించటమే నా ప్రాధాన్యం' అని జకోవిచ్ అన్నాడు. ఈ విజయంతో సిట్సిపాస్‌పై ముఖాముఖి రికార్డును 8-2కు మెరుగుపర్చుకున్నాడు.