Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో న్యూజిలాండ్-పాకిస్తాన్
- చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లా ఓటమి
క్రైస్ట్‌చర్చ్: ట్రయాంగులర్ టి20 సిరీస్ ఫైనల్లోకి పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు దూసు కెళ్లాయి. బుధ వారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 48 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ జట్టు టోర్నీనుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్ జట్టు 4మ్యాచుల్లో 6పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్తాన్ జట్టు 3మ్యాచుల్లో 4పాయింట్లతో రెండోస్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించాయి. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 208పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. కాన్వె(64), ఫిలిప్స్(60) బ్యాటింగ్‌లో రాణించారు. బంగ్లా బౌలర్ సైఫుద్దీన్(2/37) బౌలింగ్‌లో రాణించాడు. ఛేదనలో బంగ్లాజట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సమయానికి 7వికెట్లు కోల్పోయి 160పరుగులే చేయగల్గింది. షకీబ్(70), లింటన్ దాస్(23) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. మిల్నేకు మూడు వికెట్లు లభించాయి. అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
బంగ్లాదేశ్.. గురువారం పాకిస్తాన్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. మరోవైపు.. కివీస్, పాకిస్తాన్ శుక్రవారం (అక్టోబరు 14) ఫైనల్లో తలపడనున్నాయి.