Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లండ్ చేతిలో 8పరుగుల తేడాతో పరాజయం
కాన్బెర్రా(ఆస్ట్రేలియా) : టి20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చే ఆస్ట్రేలియా జట్టుకు టోర్నీకి ముందు పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. మెగా టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలో భాగంగా టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటైన ఇంగ్లండతో జరుగుతున్న మూడు టి20ల సిరీస్‌లో ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టి20లో 8పరుగుల తేడాతో ఓడిన ఆసీస్.. కాన్బెర్రా వేదికగా బుధవారం జరిగిన రెండో టి20లోనూ 8పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నేటి మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 178పరుగుల స్కోర్‌ను నమోదు చేసింది. మలన్(82; 49బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు), మొయిన్(44; 27బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్‌లో రాణించారు. స్టొయినీస్‌కు మూడు, జంపాకు రెండు, కమ్మిన్స్, స్టార్క్‌కు తలా ఒక వికెట్ లభించాయి. ఛేదనలో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 6వికెట్లు కోల్పోయి 170పరుగులే చేయగల్గింది. మిఛెల్ మార్ష్(45), టిమ్ డేవిడ్(40), స్టొయినీస్(22) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. శామ్ కర్రన్‌కు మూడు, స్టోక్స్, విల్లీ, టోప్లేకు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ డేవిడ్ మలన్‌కు లభించగా.. మూడో, చివరి టి20 శుక్రవారం జరగనుంది.