Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారత మహిళా డిస్కస్ త్రోయర్, టోక్యో ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన కమల్ ప్రీత్ కౌర్‌పై ప్రపంచ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటి యూనిట్(ఎఐయు) మూడేళ్ల నిషేధం విధించింది. ఎఐయు తన వెబ్సైట్లో.. కమల్‌ప్రీత్ కౌర్ డోపింగ్ నిరోధక నియమాల్ని ఉల్లంఘించినట్లు అంగీకరించిందని, ఆ తర్వాత ఎదురయ్యే పర్యవసానాలకు అంగీకరించడంతో ఆమెపై నాలుగేళ్ల నిషేధాన్ని ఒక ఏడాది తగ్గించి మూడేళ్ల నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. ఎఐయు ద్వారా న్యూఢిల్లీలోని నేషనల్ డోపింగ్ టెస్ట్ లాబొరేటరీలో ఆమె రక్త నమూనాల పరీక్షకు అనుమతి ఉన్నా.. ఆమె ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో నాలుగు సప్లిమెంట్లను పరీక్షించినట్లు, ఒక సప్లిమెంట్ మాత్రమే 'స్టెరాయిడ్ యొక్క జాడలు' ఉన్నట్లు ఆమె ఎఐయుకు తొలుత తెలియజేసింది. ఆ తర్వాత మార్చి 7న పాటియాలాలోని ఎఐయులో సేకరించిన శాంపిల్స్‌లో కౌర్ నిషేధిత స్టెరాయిడ్ స్టానోజోలోల్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఎఐయు ఆమెపై మార్చి 29న తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో కమల్ ప్రీత్‌కు ఈ ఏడాది మార్చి నుంచి అందుకొనే ప్రైజ్ మనీకి తోడు అవార్డులు రద్దు చేయబడతాయి. టోక్యో ఒలింపిక్స్ డిస్కస్ త్రో విభాగంలో కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కు చేరి 6వ స్థానంలో నిలిచింది.