Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీపక్ చాహర్ ఔట్..
ముంబయి: దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ముగియడంతో టి20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు భారత పేసర్ల బృందం మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌తోపాటు శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతూ దూరం కాగా... అతని స్థానంలో దీపక్ చాహర్‌ను ఆసీస్‌కు పంపేందుకు బిసిసిఐ సిద్ధమైంది. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే అనంతరం అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత సెలెక్షన్ కమిటీ వడపోతలు పట్టి అంతిమంగా ముగ్గురు పేర్లను ఫైనల్ చేసింది. షమీ, సిరాజ్, శార్ధూల్లలో (ట్రిపుల్ ఎస్) ఒకరు బుమ్రా స్థానాన్ని భర్తీ చేస్తారని టీమిండియా యాజమాన్యం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వీరితో పాటు స్టాండ్ బై ప్లేయర్లుగా శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోరు కూడా ఆస్ట్రేలియా విమానమెక్కనున్నారు. దీపక్ చాహర్‌కు గాయం తిరగబెట్టడంతో అతను ఆస్ట్రేలియాకు వెళ్లడం కష్టమైంది. మరోవైపు నెట్ బౌలర్లుగా ఎంపికైన ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ వీసా సమస్యల కారణంగా భారత్‌లోనే ఉండిపోయారు. వీరి వీసా సమస్య పరిష్కారమైతే వీరిద్దరు ఆస్ట్రేలియాకు బయలుదేరతారు.