Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16పతకాలతో ఆంధ్రకు 21వ, 23 పతకాలతో తెలంగాణకు 15వ స్థానం
- ముగిసిన 36వ జాతీయ క్రీడలు
అహ్మదాబాద్: సెప్టెంబర్ 29న ప్రారంభమైన 36వ జాతీయ క్రీడలు బుధవారం జరిగిన ముగింపు వేడుకలతో ముగిసాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోధర, రాజ్‌కోట్, భావనగర్‌లలో ఈసారి పోటీలు జరిగాయి. జాతీయ క్రీడలకు తొలిసారి గుజరాత్ రాష్ట్రం ఆతిథ్యమిచ్చింది. సుమారు 7వేలకు పైగా అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పతకాలకై పోటీపడ్డారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకలకు గుజరాత్ క్రీడా శాఖామంత్రి హర్ష్ సంఘ్వీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్‌బోర్డు(ఎస్ఎస్సిబి) జట్టు 61 స్వర్ణాలతో మొత్తం 128పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు 2స్వర్ణ, 9రజత, 5కాంస్యాలతో మొత్తం 16పతకాలతో 21వ స్థానంలో నిలవగా.. తెలంగాణ 8స్వర్ణ, 7రజత, 8కాంస్యాలతో మొత్తం 23పతకాలతో 15వ స్థానంలో నిలిచింది. 37వ జాతీయ క్రీడలకు గోవా ఆతిథ్యమివ్వనుంది.
వాలీబాల్లోలో కేరళకు స్వర్ణం
జాతీయ క్రీడల చివరిరోజు జరిగిన పోటీల్లో వాలీబాల్ పురుషుల విభాగంలో కేరళ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో కేరళ 3-0తో తమిళనాడును ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో కేరళ జట్టు 25-23, 28-26, 25-23 పాయింట్ల తేడాతో తమిళనాడుపై విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. కాంస్య పతకాన్ని హర్యానా జట్టు 3-2తో కైవసం చేసుకుంది. పతక పోటీలో హర్యానా జట్టు 25-12, 25-22, 22-25, 21-25, 15-11తో గుజరాత్‌ను ఓడించింది. ఇక మహిళల బాక్సింగ్ మిడిల్‌వెయిట్ విభాగంలో అస్సాంకు చెందిన లౌలీనా బోర్గోహైన్ 5-0తేడాతో హర్యానాకు చెందిన సావేటిపై గెలిచింది. పురుషుల వెల్టర్‌వెయిట్‌లో ఆకాశ్(సర్వీసెస్) 5-0తో సాగర్(హర్యానా)పై, మిడిల్వెయిట్లో నిఖిల్ దూబే(మహరాష్ట్ర 5-0తో మల్సాముత్తంగ(మిజోరాం)పై, లైట్‌వెయిట్‌లో సంజీత్ (సర్వీసెస్) 5-0తో నవీన్‌కుమార్ (హర్యానా) పై, సూపర ్హెవీవెయిట్లో నరేంద్ర (సర్వీసెస్) 5-0తో సావన్గిల్(ఛండీగడ్)పై విజయం సాధించి బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు.
పతకాల పట్టిక
వ.సం. రాష్ట్రం స్వ ర కా మొ
1. సర్వీసెస్ 61 35 32 128
2. మహరాష్ట్ర 39 38 63 140
3. హర్యానా 38 38 39 115
4. కర్ణాటక 27 23 38 88
5. తమిళనాడు 25 22 27 74
6. కేరళ 23 18 13 54
7. మధ్యప్రదేశ్ 20 25 21 66
8. ఉత్తరప్రదేశ్ 20 18 18 56
9. మణిపూర్ 20 10 20 50
10. పంజాబ్ 19 32 25 76
11. ఢిల్లీ 14 17 40 71
12. గుజరాత్ 13 15 21 49
13. పశ్చిమబెంగాల్ 13 14 17 43
14. అస్సాం 9 10 9 28
15. తెలంగాణ 8 7 8 23
16. అరుణాచల్‌ప్రదేశ్ 6 10 0 7
17. ఒడిషా 4 11 11 26
18. జార్ఖండ్ 3 5 5 13
19. రాజస్తాన్ 3 3 21 27
20. ఛండీగడ్ 3 4 4 11
21. ఆంధ్రప్రదేశ్ 2 9 5 16
22. ఛత్తీస్గడ్ 2 5 6 13
23. అండమాన్ నికోబార్ 2 5 5 12
24. హిమాచల్ ప్రదేశ్ 2 4 3 9
25. త్రిపుర 2 0 1 3
26. ఉత్తరాఖండ్ 1 8 9 18
27. జమ్ము-కాశ్మీర్ 1 2 9 12
28. మిజోరాం 1 1 2 4
29. పాండిచ్ఛేరి 1 1 2 4
30. గోవా 0 0 5 5
31. బీహార్ 0 0 2 2
32. సిక్కిం 0 0 1 1