Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో శ్రీలంకతో భారత్ ఢ
- 2022 ఆసియా కప్ ఫైనల్ నేడు
సిల్హట్ : భారత మహిళల జట్టు ఆసియా కప్‌లో సిక్సర్ కొట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆసియా కప్‌లో రికార్డు స్థాయిలో ఏడోసారి ఫైనల్లోకి ప్రవేశించిన టీమ్ ఇండియా అమ్మాయిలు.. ఆరో సారి విజేతగా అవతరించేందుకు ఎదురుచూస్తున్నారు. 2022 ఆసియా కప్ (టీ20) ఫైనల్లో నేడు శ్రీలంకతో భారత్ తాడోపేడో తేల్చుకోనుంది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలో నిలిచిన టీమ్ ఇండియా అంచనాలకు తగినట్టుగానే అద్వితీయ ప్రదర్శన చేసింది. ఎదురులేని విజయాలతో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచి, సెమీస్‌లో ఏకపక్ష విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి భారత్‌కు టైటిల్ సవాల్ ఎదురవుతుందని అంచనా వేసినా.. మెన్స్ జట్టు తరహాలోనే శ్రీలంక మహిళల జట్టు సైతం కండ్లుచెదిరే ప్రదర్శన కనబర్చి ఫైనల్లోకి దూసుకొచ్చింది. మెన్స్ జట్టు తరహాలోనే ఆసియా కప్‌ను ఎగరేసుకుపోవాలని ఆ జట్టు తహతహ లాడుతోంది.
భారత్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ సహా దీప్తి శర్మ కీలకం కానున్నారు. ఈ నలుగురు మెరిస్తే నేడు ఆరో టైటిల్ విజయం భారత్‌కు లాంఛనమే. ఇక శ్రీలంక జట్టు నాయకి చమరి ఆటపట్టు అత్యంత ప్రమాదకారి. భారత్‌పై ధనాధన్ ఇన్నింగ్స్‌లు నమోదు చేసిన చరిత్ర ఆమెకుంది. టాప్ ఆర్డర్లో ఆటపట్టుకు కళ్లెం వేయగలిగితే భారత్‌కు పెద్దగా ఆటంకం ఉండదు. భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న ఆసియా కప్ ఫైనల్స్ సమరం నేడు మధ్యాహ్నాం 1 గంటకు ఆరంభం. స్టార్‌స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ హాట్‌స్టార్‌లో మ్యాచ్ ప్రసారం అవుతుంది.