Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదా నిష్క్రమణపై అరుణ్ ధుమాల్
న్యూఢిల్లీ : బీసీసీఐ అధ్యక్ష పదవిలో సౌరవ్ గంగూలీ కొనసాగేందుకు బోర్డు సభ్యులు ఇష్టపడలేదని, దాదా పని తీరు పట్ల సభ్యులు సంతృప్తి లేరని వస్తున్న వార్తల పట్ల కాబోనే ఐపీఎల్ చైర్మన్ అరుణ్ కుమార్ ధుమాల్ స్పందించారు. ' గంగూలీ గురించి ఎవరూ ఒక్క మాట కూడా అనలేదు. ఆఫీస్ బేరర్లుగా ఎవరు ఉండాలనే చర్చలో దాదా సైతం ఉన్నారు. ప్రతి నిర్ణయంలో గంగూలీ ఉన్నారు. ఏ అధ్యక్షుడు బీసీసీఐలో మూడేండ్లకు పైగా కొనసాగలేదు. రోజర్ బిన్ని వయసు 67. రూల్స్ ప్రకారం ఆయన మళ్లీ పదవి చేపట్టలేరు. అనుభవం గడించిన అందరూ ఒకే టర్మ్‌లో పదవీ కాలం పూర్తి చేసుకుంటే.. విరామ సమయంలో బోర్డుకు సమస్య ఉత్పన్నం అవుతుంది. అందుకే, ఈ నిర్ణయాలు అందరం కలిసి తీసుకున్నాం. అధ్యక్షుడిగా గంగూలీ పని తీరు పట్ల అందరం సంతృప్తిగా ఉన్నాం. కోవిడ్ సమయంలో దాదా గొప్పగా క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఐపీఎల్ చైర్మన్ పదవి ఆఫర్‌ను గంగూలీ తీసుకుంటే.. నేను బోర్డుకు పూర్తిగా దూరం అయ్యేవాడిని. దాదా ఐపీఎల్ చైర్మన్ వద్దు అనుకోవటంతోనే నేను పదవి చేపడుతున్నాను' అని అరుణ్ కుమార్ ధుమాల్ అన్నాడు. ప్రస్తుతం కోశాధికారిగా ఉన్న అరుణ్ కుమార్ ధుమాల్.. ఐపీఎల్ చైర్మన్‌గా ఎంపిక కానున్నాడు. జై షా కార్యదర్శిగా కొనసాగనుండగా, రోజర్ బిన్ని అధ్యక్ష పగ్గాలు అందుకోనున్నాడు. కోశాధికారిగా ఆశీష్, సంయుక్త కార్యదర్శిగా దేవజిత్ ఎన్నిక కానున్నారు. అక్టోబర్ 18న బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఏజీఎం సమావేశమై నూతన ఆఫీస్ బేరర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోనుంది.