Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆసియా కప్‌లో భారత్ సప్తపది. అమ్మాయిలు మళ్లీ ఆసియా కప్‌పై ముద్దు పెట్టారు. టైటిల్ పోరులో శ్రీలంకపై ఏకపక్ష విజయం నమోదు చేసిన హర్మన్‌ప్రీత్ సేన.. రికార్డు స్థాయిలో ఏడోసారి ఆసియా కప్ విజేతగా అవతరించింది. రేణుక సింగ్ నిప్పులు చెరిగే ప్రదర్శనతో తొలుత శ్రీలంకను 65 పరుగులకు పరిమితం అవగా.. స్మృతీ మంధాన అజేయ అర్థ సెంచరీతో స్వల్ప లక్ష్యాన్ని భారత్ 8.3 ఓవర్లలోనే ఛేదించింది. 2022 మహిళల ఆసియా కప్ చాంపియన్‌గా భారత్ అవతరించింది.
- ఏడోసారి ఆసియా కప్ కైవసం
- ఫైనల్లో శ్రీలంకపై ఘన విజయం
- రేణుక, మంధాన మెరుపు ప్రదర్శన
నవతెలంగాణ-సిల్హట్ :భారత మహిళలే ఆసియా క్వీన్స్. బంతితో, బ్యాట్‌తో ఎదురులేని ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. సిల్హట్లో శనివారం జరిగిన 2022 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చిత్తుగా ఓడింది. ఆసియా కప్ చరిత్రలో ఎనిమిది సార్లు ఫైనల్స్‌కు చేరుకున్న భారత్.. ఏకంగా రికార్డు స్థాయిలో ఏడో సారి విజేతగా నిలిచింది. 66 పరుగుల ఛేదనలో ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన (51 నాటౌట్, 25 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగింది. 25 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన మంధాన.. మెరుపు సిక్సర్‌తో టైటిల్ విజయం ఖాయం చేసింది. అంతకముందు, పేసర్ రేణుక సింగ్ (3/5) పవర్‌ప్లేలో పవర్ఫుల్ ప్రదర్శన చేసింది. రాజేశ్వరి గైక్వాడ్, స్నేV్‌ా రానాలు సైతం మాయ చేయటంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు 65 పరుగులు చేసింది. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక అత్యల్ప స్కోరు రికార్డును మూటగట్టుకుంది. రేణుక సింగ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకోగా.. టోర్నీలో 13 వికెట్లు సహా 94 పరుగులు సాధించిన దీప్తి శర్మ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును కైవసం చేసుకుంది. ఆసియా కప్ ట్రోఫీని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందుకుంది. శ్రీలంక మహిళల జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
రేణుక సూపర్ షో
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు పరిమితం అయ్యింది. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినా.. లంక అమ్మాయిలు 65 పరుగులే చేయగలిగారు. పవర్‌ప్లేలో భారత పేసర్ రేణుక సింగ్ స్వింగ్ నిప్పులు కక్కింది. టాప్ ఆర్డర్లో తొలి ఐదు వికెట్లలో రేణుక సింగ్ ఏకంగా నలుగురు బ్యాటర్లను వెనక్కి పంపించింది. ఓపెనర్లు చమరి ఆటపట్టు (6), అనుష్క సంజీవని (2)లు రనౌట్‌గా నిష్క్రమించగా.. మాధవి (1), హాసిని పెరీరా (0), కవిష దిల్హారి (1)లను రేణుక సింగ్ సాగనంపింది. స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్, స్నేV్‌ా రానాలు సైతం మ్యాజిక్ చేశారు. రాజేశ్వరి, స్నేV్ాలు చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. చివరి వికెట్‌కు రణవీర (18 నాటౌట్, 22 బంతుల్లో 2 ఫోర్లు), ఆచిని కులసూర్య (6 నాటౌట్) విలువైన పరుగులు జోడించటంతో శ్రీలంక మహిళల జట్టు 50 పరుగుల మైలురాయి దాటగలిగింది.
మంధాన మెరుపుల్
స్వల్ప ఛేదనలో స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన (51 నాటౌట్, 25 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ (5), జెమీమా రొడ్రిగస్ (2) భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు కోల్పోయారు. అయినా, మంధాన మరో ఎండ్‌లో బౌండరీల మోత మోగించింది. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో మంధాన మెరిసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (11 నాటౌట్) మంధానకు తోడుగా నిలిచింది. మరో 69 బంతులు మిగిలి ఉండగానే 8.3 ఓవర్లలోనే భారత్ లాంఛనం ముగించింది.
ఎదురేది!
ఆసియా కప్‌లో భారత మహిళల జట్టుది ఏకచక్రాధిపత్యం. ఇప్పటి వరకు ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు, టీ20 ఫార్మాట్లో నాలుగు సార్లు జరిగింది. వన్డే ఫార్మాట్లో జరిగిన 2004, 2005, 2006, 2008 టోర్నీల్లో భారత్ విజేతగా నిలిచింది. టీ20 ఫార్మాట్లో 2012, 2016, 2022 టోర్నీల్లో చాంపియన్‌గా అవతరించింది. పొట్టి ఫార్మాట్లోనే జరిగిన 2018 ఆసియా కప్ ఫైనల్స్‌కు చేరినా.. బంగ్లాదేశ్‌కు టైటిల్‌ను కోల్పోయింది. ఆసియా కప్ చరిత్రలో ఎనిమిది టోర్నీలు జరుగగా.. ఏడుసార్లు భారత్ చాంపియన్‌గా నిలిచింది.
స్కోరు వివరాలు ...
శ్రీలంక ఇన్నింగ్స్ : చమరి ఆటపట్టు (రనౌట్) 6, అనుష్క సంజీవని (రనౌట్) 2, మాధవి (సి) రిచా (బి) రేణుక సింగ్ 1, హాసిని పెరీరా (సి) స్మృతీ మంధాన (బి) రేణుక సింగ్ 0, కవిష దిల్హరి (బి) రేణుక సింగ్ 1, రణసింఘె (బి) రాజేశ్వరి గైక్వాడ్ 13, షెహాని (సి,బి) స్నేV్‌ా రానా 0, సుగంధిక కుమారి (బి) స్నేV్‌ా రానా 6, రణవీర నాటౌట్ 18, కులసూరియ నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 65.
వికెట్ల పతనం : 1-8, 2-9, 3-9, 4-9, 5-16, 6-18, 7-25, 8-32, 9-43.
బౌలింగ్ : దీప్తి శర్మ 4-0-7-0, రేణుక సింగ్ 3-1-5-3, రాజేశ్వరి గైక్వాడ్ 4-0-16-2, స్నేV్‌ా రానా 4-0-13-2, హేమలత 3-0-8-0, షెఫాలీ వర్మ 2-0-16-0.
భారత్ ఇన్నింగ్స్ : షెఫాలీ వర్మ (స్టంప్డ్) అనుష్క సంజీవని (బి) రణవీర 5, స్మృతీ మంధాన నాటౌట్ 51, జెమీమా రొడ్రిగస్ (బి) కవిష దిల్హారి 2, హర్మన్‌ప్రీత్ కౌర్ నాటౌట్ 11, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం : (8.3 ఓవర్లలో 2 వికెట్లకు) 71.
వికెట్ల పతనం : 1-32, 2-35.
బౌలింగ్ : ఒషాడి రణసింఘె 2.3-0-30-0, సుగంధిక కుమారి 1-0-7-0, ఐనోక రణవీర 3-0-17-1, కవిష దిల్హారి 2-0-17-1.