Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విండీస్‌పై మెరుపు విజయం
- ఐసీసీ టీ20 ప్రపంచకప్
హౌబర్ట్ (ఆస్ట్రేలియా) : 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సంచలనాల మోత మోగుతోంది. మెగా టోర్నీ ఆరంభ రోజే ఆసియా కప్ విజేత శ్రీలంకకు పసికూన నమీబియా దిమ్మదిరిగే షాక్ ఇవ్వగా.. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ చాంపియన్ వెస్టిండీస్‌కు స్కాట్లాండ్ సూపర్ షాక్ ఇచ్చింది. తొలి రౌండ్ గ్రూప్-బి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై స్కాట్లాండ్ 42 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ జార్జ్ మున్సే (66 నాటౌట్, 53 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. మైకల్ జోన్స్ (20), మెక్లాయిడ్ (23, 14 బంతుల్లో 4 ఫోర్లు), క్రిస్ గ్రీవ్స్ (16 నాటౌట్) డెత్ ఓవర్లలో విలువైన పరుగులు పిండుకున్నారు.వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జొసెఫ్, జేసన్ హౌల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఛేదనలో వెస్టిండీ స్ అంచనాలకు భిన్నంగా కుప్పకూలింది. హిట్టర్ల తో కూడిన కరీబియన్ల జట్టు 18.3 ఓవర్లలో 118 పరుగులకే చేతులెత్తేసింది. జేసన్ హౌల్డర్ (38), కైల్ మేయర్స్ (20), నికోలస్ పూరన్ (17) విండీస్ తరఫన అత్యధిక స్కోరు సాధించారు. స్కాట్లాండ్ బౌలర్లు మార్క్ వాట్ (3/12), బ్రాడ్ వీల్ (2/32), మైకల్ లీస్క్ (2/15)లు విండీస్ బ్యాటర్ల భరతం పట్టారు. 161 పరుగుల ఛేదనలో 118 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్ 42 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. స్కాట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్సె 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.