Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి క్యాట్ కార్యదర్శి వినతి
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్థాయి, మున్పిపల్ స్థాయిల్లో క్రికెట్ కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) వ్యవస్థాపక కార్యదర్శి సునీల్ బాబు కోరారు. బీసీసీఐ దాని అనుబంధ సంఘాలు సోసైటీస్ చట్టం ప్రకారం ఏర్పాటు అయ్యాయి. ఇవి పూర్తిగా స్వతంత్ర సంస్థలు. ప్రభుత్వం జోక్యం ఏమాత్రం ఉండకూడదు. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఐసీసీ గుర్తింపు రద్దుకు గురికావాల్సి ఉంటుంది. హెచ్సీఏ సైతం ప్రభుత్వ పరిధిలోకి రాదు. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్దికి క్యాట్ 2011 నుంచి పని చేస్తోంది, బీసీసీఐలో గుర్తుం కోసం దరఖాస్తు చేసింది. తాజా ఉత్తర్వులతో జిల్లా స్థాయిలో క్రికెటర్లు గందరగోళ పరిస్థితులకు లోనయ్యే అవకాశం ఉందని సునీల్ బాబు తెలిపారు. బీసీసీఐ, హెచ్సీఏ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ఉత్వర్వులను వెనక్కి తీసుకోవాలని సునీల్ బాబు కోరారు.