Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, కివీస్ వార్మప్ రద్దు
బ్రిస్బేన్ : టీమ్ ఇండియా రెండో వార్మప్ వర్షార్పణం. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల్లో తొలుత ఆస్ట్రేలియాపై థ్రిల్లింగ్ ఫైనల్ ఓవర్లో మెరుపు విజయం నమోదు చేసిన టీమ్ ఇండియా.. బుధవారం న్యూజిలాండ్‌తో రెండో వార్మప్ మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. కానీ బ్రిస్బేన్ గబ్బా మైదానంలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. కుదించిన ఓవర్లు, చివరకు ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందని ఆశించినా.. నిరాశే ఎదురైంది. వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ రెండో వార్మప్ మ్యాచ్ రద్దు చేశారు. తొలి వార్మప్‌లో న్యూజిలాండ్ పరాజయం పాలవగా.. నేడు వర్షం కారణంగా అసంపూర్తి ప్రాక్టీస్‌తోనే సూపర్ 12 సమరానికి సిద్ధం కావాల్సి వస్తోంది. ఇక తొలి వార్మప్‌లో ఆస్ట్రేలియాపై 6 పరుగుల తేడాతో అసమాన విజయం సాధించిన రోహిత్‌సేన.. బ్యాటింగ్ లైనప్‌లో ఒకరిద్దరికి అవకాశం కల్పించాలని భావించింది. కానీ రిజర్వ్ ఆటగాళ్లకు ఇక్కడి పిచ్‌లపై ఆడిన అనుభవం అందించకుండానే.. అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో సూపర్12 సమరానికి సై అననుంది. గబ్బా స్టేడియంలోనే మధ్యాహ్నాం సెషన్లో పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మ్యాచ్ సైతం వర్షం కారణంగా అర్థాంతరంగా మధ్యలోనే ఆగిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్థాన్ 20 ఓవర్లలో 154/6 పరుగులు చేయగా.. ఛేదనలో పాకిస్థాన్ 2.2 ఓవర్లలో 16/0 వద్ద ఉండగా వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించాడు.