Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ 2022 టీ20 ప్రపంచకప్
గీలాంగ్ (ఆస్ట్రేలియా) : ఐసీసీ టీ20 ప్రపంచకప్ తొలి దశ పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, నెదర్లాండ్‌లు సూపర్ 12 దశకు చేరుకున్నాయి. గ్రూప్-ఏలో చివరి మ్యాచులు గురువారంతో ముగిశాయి. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. గ్రూప్-ఏలో మరో మ్యాచ్‌లో నమీబియాపై యుఏఈ 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయ నమోదు చేసింది. గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచిన శ్రీలంక సూపర్12 దశలో గ్రూప్-1లో అఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో ఆడనుంది. గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన నెదర్లాండ్స్ సూపర్12 దశలో గ్రూప్-2లో బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలతో ఆడనుంది. నమీబియాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యుఏఈ 20 ఓవర్లలో 148/3 పరుగులు చేసింది. ఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 141/8కు పరిమితమైంది. నమీబియాపై యుఏఈ విజయంతో నెదర్లాండ్స్ సూపర్12 దశకు అర్హత సాధించింది. ఇక నెదర్లాండ్స్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 162/6 పరుగులు చేసింది. ఛేదనలో నెదర్లాండ్స్ 146/9 పరుగులే చేసింది. 16 పరుగుల తేడాతో శ్రీలంక విజయం నమోదు చేసింది. ఇక గ్రూప్-బిలో స్కాట్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, ఐర్లాండ్ రెండేసి మ్యాచుల్లో ఒక్క విజయంతో సమవుజ్జీలుగా నిలిచాయి. నేడు ఐర్లాండ్, వెస్టిండీస్... స్కాట్లాండ్, జింబాబ్వేలు సూపర్12లో స్థానం కోసం నాకౌట్ పోరులో తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచుల్లో నెగ్గిన జట్లు నేరుగా సూపర్12కు చేరుకుంటాయి.