Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు వన్డేలు, రెండు టెస్టులు
ముంబయి : ఈ ఏడాది ఆఖర్లో టీమ్ ఇండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. సుదీర్ఘ విరామం అనంతరం బంగ్లాదేశ్‌లో మల్టీ సిరీస్ ఆడనున్న భారత జట్టు.. డిసెంబర్ 1న బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టనుంది. బంగ్లాదేశ్ జట్టుతో మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు ది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) గురువారం పర్యటన షెడ్యూల్ విడుదల చేసింది. మూడు వన్డేలు, ఓ టెస్టుకు ఢాకా వేదిక కానుండగా, ఓ టెస్టుకు చట్టోగ్రామ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
డిసెంబర్ 4న తొలి వన్డేతో పర్యటన ఆరంభం కానుంది. 7, 10న చివరి రెండు వన్డేలు ఢాకాలోనే జరుగుతాయి. తొలి టెస్టు కోసం ఇరు జట్లు చట్టోగ్రామ్కు వెళ్తాయి. అక్కడ డిసెంబర్ 14-18న తొలి టెస్టు ఆడనున్నారు. రెండో టెస్టు డిసెంబర్ 22-26న జరుగుతుంది. బాక్సింగ్ డే రోజు ఢాకాలో రెండో టెస్టుకు ముగియనుంది. డిసెంబర్ 27న బంగ్లాదేశ్ నుంచి భారత జట్టు తిరిగి స్వదేశానికి పయనం కానుంది. స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్‌కు ముందు మూడు వన్డేల సిరీస్ ప్రాధాన్యత ఉండగా.. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టులు నిర్వహిస్తున్నారు. డబ్ల్యూటీసీ 2లో 52.33 విజయ శాతం పాయింట్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్న భారత్.. బంగ్లాదేశ్‌పై రెండు టెస్టుల్లో విజయాలతో పాయింట్ల పట్టికలో ఎగబాకేందుకు చూస్తోంది. చివరగా 2015ల్లో మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత జట్టుకు బంగ్లాదేశ్‌కు వెళ్లింది. అప్పుడు, ఏకైక టెస్టు డ్రా కాగా.. వన్డే సిరీస్‌ను 2-1తో బంగ్లాదేశ్ గెల్చుకుంది.