Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్‌తో సూపర్ సమరానికి సన్నద్ధం
మెల్బోర్న్ : పెర్త్, బ్రిస్బేన్, సన్నాహాకం. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముంగిట టీమ్ ఇండియా కీలక సన్నాహాకతను పూర్తి చేసుకుంది. తొలుత పెర్త్‌లో వాకా ఎలెవన్‌తో రెండు ప్రాక్టీస్ గేములు, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో అస్త్రాలను సరి చూసుకుంది. న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్ వర్షంతో రద్దుగా ముగిసినా.. ఆసీస్‌తో మ్యాచ్‌లో థ్రిల్లర్ ముగింపుతో టీమ్ ఇండియా శిబిరంలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. సూపర్12 దశ అక్టోబర్ 22న ఆరంభం కానుండగా.. అక్టోబర్ 23న భారత్, పాకిస్థాన్‌లు ముఖాముఖి పోటీపడనున్నాయి. పాకిస్థాన్‌తో మెగా మ్యాచ్‌కు మూడు రోజుల ముందుగానే రోహిత్గ్యాంగ్ మెల్బోర్న్కు చేరుకుంది. క్రికెటర్లు మెల్బోర్న్కు చేరుకున్న ఫోటోలు, వీడియోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.
నేడు ప్రాక్టీస్ : ఆదివారం మెగా మ్యాచ్ ఉండటంతో శుక్రవారం నుంచి భారత క్రికెటర్లు కఠోరంగా నెట్ ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ మేరకు విభాగాల వారీగా కోచింగ్ బృందం షెడ్యూల్ రూపొందించినట్టు తెలుస్తోంది. తుది జట్టు కూర్పుపై సైతం కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు తేల్చుకోవాల్సిన పలు అంశాలు ఉన్నాయి. మ్యాచ్‌కు సిద్ధం చేసిన పిచ్, ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్ల ఆధారంగా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తుది జట్టు ఎంపిక ఉండనుందని చెప్పవచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు నేడు ప్రాక్టీస్ సెషన్లో ముందుండి ఆటగాళ్లను ఉత్సాహపరచనున్నారు.
వర్షం ముప్పు? : ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు జీవితకాల క్షీణ దశకు చేరుకున్న పరిస్థితుల్లో భారత్, పాకిస్థాన్ ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లలో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి. అక్టోబర్ 23న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై అభిమానులతో పాటు ప్రసారదారులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మెల్బోర్న్ వాతావరణం ప్రస్తుతానికి ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఆదివారం వర్షం కురిసేందుకు 60 శాతం అవకాశం ఉంది. ఆదివారానికి సైతం ఇదే సూచన కొనసాగితే మ్యాచ్ రద్దు కావటంతో, కుదించిన ఓవర్లతో మ్యాచ్‌కు ఆటంకం కలిగేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.