Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 వికెట్ల తేడాతో అఫ్గాన్‌పై గెలుపు
పెర్త్ (ఆస్ట్రేలియా) : మాజీ చాంపియన్ ఇంగ్లాండ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను విజయంతో ఆరంభించింది. గ్రూప్-1లో అఫ్గనిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో అలవోక విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్థాన్ 19.4 ఓవర్లలో 112 పరుగులకే పది వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్ శామ్ కరణ్ (5/10) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. ఇబ్రహీం జాద్రాన్ (32), ఉస్మాన్ ఘని (30)లు రాణించటంతో అఫ్గాన్ ఆమాత్రం స్కోరు సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 18.1 ఓవర్లలో ఊదేసింది. లియాం లివింగ్‌స్టోన్ (29 నాటౌట్, 21 బంతుల్లో 3 ఫోర్లు) రాణించాడు. జోశ్ బట్లర్ (18), అలెక్స్ హేల్స్ (19), డెవిడ్ మలాన్ (18) విలువైన పరుగులు జోడించారు. ఐదు వికెట్ల వీరుడు శామ్ కరణ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
సంక్లిప్త స్కోర్లు :
అఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్ : 112/10 (ఇబ్రహీం 32, ఉస్మాన్ 30, శామ్ కరణ్ 5/10, బెన్ స్టోక్స్ 2/19)
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : 113/5 (లివింగ్‌స్టోన్ 29, అలెక్స్ హేల్స్ 19, రషీద్ ఖాన్ 1/17, నబి 1/16)