Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెరీర్ రెండో అత్యుత్తమ ర్యాంక్‌కు చేరిక
- బిడబ్ల్యుఎఫ్ ర్యాంకింగ్స్ విడుదల
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాడ్మింటస్ సమాఖ్య(బిడబ్ల్యుఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో పివి సింధు సత్తా చాటింది. బిడబ్ల్యుఎఫ్ మంగళవారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో పివి సింధు 5వ ర్యాంక్‌లో నిలిచింది. ఈ ఏడాది ఆగస్టులో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన అనంతరం పివి సింధు మరో టోర్నమెంట్ బరిలోకి దిగలేదు. దీంతో సింధు ఆడిన 26 టోర్నమెంట్లను పరిగణనలోకి తీసుకోగా.. సింధు ఖాతాలో 87218పాయింట్లు ఉన్నాయి. సింధు కెరీర్ బెస్ట్ ర్యాంక్ 2వ ర్యాంక్ కాగా.. తాజాగా టాప్-5లో చోటు దక్కించుకోవడంతో విశేషం. ఇక సింధు గాయం నుంచి కోలుకొని సోమవారం నుంచి ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది. ఇక పురుషుల విభాగంలో హెచ్ఎస్ ప్రణరు రారు 12వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇటీవల జరిగిన డెన్మార్క్ ఓపెన్ సూపర్-750 టోర్నీలో ప్రణరు క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు. 30ఏళ్ల ప్రణరు 26 టోర్నమెంట్ల ద్వారా 64,330పాయింట్లతో ఈ ర్యాంక్‌కు ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత లక్ష్యసేన్ 8, కాంస్య పతక విజేత కిదాంబి శ్రీకాంత్ 11వ ర్యాంక్‌లో నిలిచారు. పురుషుల డబుల్స్‌లో సాత్త్విక్-చిరాగ్ జోడీ 8వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. మహిళల డబుల్స్‌లో త్రీషా-గాయత్రి జోడీ 27, భట్నాగర్-తనీషా జోడీ 29వ ర్యాంక్‌లో నిలిచారు. అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీ 24వ ర్యాంక్‌లో ఉండగా.. రెండుసార్లు కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో 33వ ర్యాంక్‌కు పడిపోయింది.