Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెర్త్: ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా కరోనా బారిన పడ్డాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు జరిపిన ఆర్టీపిసిఆర్ పరీక్షల్లో జంపాకు నామమాత్రపు కరోనా లక్షణాలున్నట్లు తేలిందని ఒక స్పోర్ట్స్ వెబ్సైట్ తెలిపింది. ఆ కారణంగా జంపా శ్రీలంకతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని, ఒకవేళ లంకతో మ్యాచ్ బరిలోకి దిగాల్సి వస్తే మాత్రం అతడు విడిగా బస, ప్రయాణం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఐసిసి నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు కరోనా బారిన పడినా.. మ్యాచ్ బరిలోకి దిగేందుకు అర్హుడు. ఇలాగే ఐర్లాండ్‌కు చెందిన జార్జ్ డాక్రెల్కు కరోనా పాజిటివ్ వచ్చినా.. ఆదివారం శ్రీలంకతో హౌబర్ట్ వేదికగా జరిగిన మ్యాచ్ బరిలోకి దిగాడు.