Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు
- టి20 ప్రపంచకప్
పెర్త్: ఐసిసి టి20 ప్రపంచకప్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. తొలి మ్యాచ్‌లోనే న్యూజిల్యాండ్ చేతిలో అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసిన ఆసీస్.. మంగళవారం శ్రీలంక జట్టుపై సమిష్టిగా రాణించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్జట్టు శ్రీలంక జట్టును 157 పరుగులకే పరిమితం చేసింది. ఆ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన పథుమ్ నిస్సంక(40) రాణించినా.. కుశాల్ మెండిస్(5) నిరాశ పరిచాడు. రెండో ఓవర్లోనే లంక తొలి వికెట్ కోల్పోగా... మెండిస్ స్థానంలో వచ్చిన ధనంజయ డిసిల్వా(26), ఛరిత్ అసలంక(38నాటౌట్) జోరు చూపించినా... వరుసగా వికెట్లు కూలడంతో లంక బ్యాటర్లు భారీ స్కోర్లు రాబట్టలేకపోయారు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి లంక 157 పరుగులు మాత్రమే చేసింది. హేజిల్‌వుడ్, కమ్మిన్స్, స్టార్క్, అగర్, మ్యాక్స్‌వెల్‌కు తలా ఒక్కో వికెట్ దక్కాయి. 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్(11) నిరాశపరిచినా.. ఆరోన్ ఫించ్(31) రాణించాడు. ఆ తర్వాత మిచెల్ మార్షల్(18), గ్లెన్ మ్యాక్స్‌వెల్(23) క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఆ తర్వాత మార్కస్ స్టొయినీస్(59నాటౌట్; 18బంతుల్లో 4ఫోర్లు, 6సిక్సర్లు) విధ్వంస ఇన్నింగ్స్ ఆడాడు. 327.77 స్ట్రయిక్ రేటుతో ఆడిన స్టొయినీస్ 16.9 ఓవర్లలోనే ఆసీస్‌కు విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్టొయినీస్‌కు లభించగా.. ధనుంజయ, కరుణరత్నే, తీక్షణకు ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు...
శ్రీలంక ఇన్నింగ్స్: నిస్సంక (రనౌట్) మిఛెల్ మార్ష్/వేడ్ 40, మెండీస్ (సి)మిఛెల్ మార్ష్ (బి)కమ్మిన్స్ 5, డి సిల్వ (సి)వార్నర్ (బి)అగర్ 26, అసలంక (నాటౌట్) 38, రాజపక్సె (సి)కమ్మిన్స్ (బి)స్టార్క్ 7, శనక (సి)వేడ్ (బి)మ్యాక్స్‌వెల్ 3, హసరంగ (సి)వేడ్ (బి)హేజిల్‌వుడ్ 1, కరుణరత్నే (నాటౌట్) 14, అదనం 23. (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 157పరుగులు.
వికెట్ల పతనం: 1/6, 2/75, 3/97, 4/106, 5/111, 6/120
బౌలింగ్: హేజిల్‌వుడ్ 4-0-26-1, కమ్మిన్స్ 4-0-36-1, స్టార్క్ 4-0-23-1, అగర్ 4-0-25-1, స్టొయినీస్ 2-0-17-0, మిఛెల్ మార్ష్ 1-0-14-0, మ్యాక్స్‌వెల్ 1-0-5-1.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సి)శనక (బి)తీక్షణ 11, ఫించ్ (నాటౌట్) 31, మిఛెల్ మార్ష్ (సి)రాజపక్సె (బి)ధనుంజయ 17, మ్యాక్స్‌వెల్ (సి)భండారా (బి)కరుణరత్నే 23, స్టొయినీస్ (నాటౌట్) 59, అదనం 17. (16.3ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 158పరుగులు
వికెట్ల పతనం: 1/26, 2/60, 3/89
బౌలింగ్: ఫెర్నాండో 0.5-0-5-0, ధనుంజయ 2.1-0-18-1, లాహిరు కుమార 3.3-0-22-0, కరుణరత్నే 3-0-20-1, తీక్షణ 3-0-23-1, హసరంగ 3-0-53-0, శనక 1-0-10-0