Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులో హైదరాబాద్, ముంబయి సైతం
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల మినీ వేలానికి బీసీసీఐ ఈ ఏడాది సరికొత్త వేదిక కోసం అన్వేషిస్తోంది. సహజంగా ఐపీఎల్ వేలం ప్రక్రియ బెంగళూర్‌లో జరుగుతుంది. బీసీసీఐ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఇక్కడ ఉండటంతో తొలి నుంచి వేలం ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ వేలానికి సైతం గ్లోబల్ ఆకర్షణ తీసుకొచ్చేందుకు టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఈ ఏడాది మినీ వేలం నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఇస్తాంబుల్, బెంగళూర్‌తో పాటు హైదరాబాద్, ముంబయి, న్యూఢిల్లీ నగరాలను సైతం మినీ వేలం కోసం షార్ట్‌లిస్ట్ చేసినట్టు సమాచారం. డిసెంబర్ 16న ఐపీఎల్ మినీ వేలం నిర్వహించనున్నారు. ఇక వేదికపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.