Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్‌పై మెరుపు విజయం
- ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022
మెల్బోర్న్ : పొట్టి ప్రపంచకప్‌లో సంచలనాల మోత మోగుతూనే ఉంది. మాజీ చాంపియన్ ఇంగ్లాండ్‌కు పసికూన ఐర్లాండ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సూపర్12 గ్రూప్-1 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో మెరుపు విజయం నమోదు చేసింది. ఐర్లాండ్ చేతిలో పరాజయంతో ఇంగ్లాండ్ సెమీఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. వర్షం ప్రభావం చూపిన మ్యాచ్‌లో ఐర్లాండ్ అనూహ్య విజయం సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఆండీ బల్బిర్నె (62, 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. లార్కాన్ టక్కర్ (34, 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. కర్టిస్ చాంపెర్ (18), పాల్ స్టిర్లింగ్ (14), గారెత్ డెలానీ (12)లు ఫర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్ (3/17), మార్క్‌వుడ్ (3/34), శామ్ కరణ్ (2/31)లు రాణించారు. ఛేదనలో జోశ్ బట్లర్ (0), అలెక్స్ హేల్స్ (7), బెన్ స్టోక్స్ (6) విఫలమయ్యారు. డెవిడ్ మలాన్ (35, 37 బంతుల్లో 2 ఫోర్లు) పరిస్థితులకు అనుగుణంగా పరుగులు సాధించలేదు. 14.3 ఓవర్లలో ఇంగ్లాండ్ 105/5 వద్ద ఉండగా.. వర్షం ఆటంకం కలిగించింది. ఎడతెగని వర్షంతో మ్యాచ్‌కు ముందుకు సాగలేదు. దీంతో ఫలితాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో తేల్చారు. 14.3 ఓవర్లలో ఇంగ్లాండ్ 111 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లాండ్ 105 పరుగులే చేసింది. దీంతో ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో అనూహ్య విజయం ఖాతాలో వేసుకుంది. మోయిన్ అలీ (24 ఆటౌట్, 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), లియాం లివింగ్‌స్టోన్ (1 నాటౌట్, 2 బంతుల్లో) ఛేదనను మరో స్థాయికి తీసుకెళ్తున్న తరుణంలో వర్షం ఆటంకం కలిగింది. దీంతో ఇంగ్లాండ్‌కు చేదు పరాభవం తప్పలేదు.
ఇక గ్రూప్-1లో భాగంగా న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దుగా ముగిసింది. గ్రూప్-1లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి బోణీ కొట్టిన న్యూజిలాండ్.. అఫ్గాన్‌పై విజయాన్ని ఆశించింది. మెల్బోర్న్లో వాతా వరణం సహకరించలేదు. దీంతో న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్ పాయింట్లు సమంగా పంచుకున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పాయింట్లు పంచుకోవటంతో గ్రూప్-1 సెమీఫైనల్ అవకాశాలు కాస్త ఇటు ఇటుగా ప్రభావితం కానున్నాయి!.
సంక్షిప్త స్కోరు వివరాలు
ఐర్లాండ్ ఇన్నింగ్స్ : 157/10 (ఆండీ బల్బిర్నె 62, టక్కర్ 34, లివింగ్‌స్టోన్ 3/17, మార్క్‌వుడ్ 3/34)
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : 105/5 (డెవిడ్ మలాన్ 35, మోయిన్ అలీ 24, లిటిల్ 2/16, జార్జ్ డాక్రెల్ 1/5)