Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాబర్ ఆజామ్‌పై అక్రమ్ విమర్శలు
కరాచీ : ఇది గల్లీ క్రికెట్ కాదు. అంతర్జాతీయ స్థాయి పోటీ. ఐసీసీ టీ20 ప్రపంచకప్. బాబర్ ఆజామ్ మరింత తెలివిగా వ్యవహరించాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ పదునైన విమర్శలు సంధించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్.. రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది. 130 పరుగుల ఛేదనలో ఆ జట్టు 20 ఓవర్లలో 129/8కు పరిమితమైంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్థాన్ సెమీఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఇప్పుడు గ్రూప్-2 నుంచి భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా లేదా జింబాబ్వే సెమీఫైనల్ రేసులో ముందున్నాయి. ' గత ఏడాది కాలంగా మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉందని తెలుసు. అటువంటి సమయంలో షోయబ్ మాలిక్ వంటి సీనియర్ ఆటగాడిని మిడిల్ ఆర్డర్లో ఎంచుకోవాలి. ప్రపంచకప్ నెగ్గాలనే లక్ష్యం ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న ఉత్తమ ఆటగాళ్లను ఎంచుకోవాలి. బాబర్ ఆజామ్ జట్టు ఎంపికలో తనకు ఇష్టమైన ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పిస్తున్నాడు. బాబర్ ఆజామ్ మరింత తెలివిగా ఉండాలి. వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో జట్టులోకి ఆటగాళ్లకు తీసుకోవడానికి ఇదేమీ గల్లీ క్రికెట్ కాదు. జట్టు ఎంపికపై నేను విన్న మాటలనే చెబుతున్నాను' అని వసీం అక్రమ్ అన్నాడు.