Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్ : భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టిలు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీఫైనల్లో దక్షిణ కొరియా జోడీపై వరుస గేముల్లో గెలుపొందిన భారత జంట.. టైటిల్ పోరుకు చేరుకున్నారు. 45 నిమిషాల్లోనే ఫైనల్లో అడుగుమోపిన సాత్విక్, చిరాగ్ జోడీ.. 21-18, 21-14తో మెరుపు విజయం సాధించారు. ఏడో సీడ్ భారత జోడీ ఈ ఏడాది డబ్ల్యూటీఎఫ్ వరల్డ్ టూర్ ఈవెంట్లో రెండోసారి ఫైనల్స్‌కు చేరుకుంది. నెట్ గేమ్‌ను నియంత్రించిన సాత్విక్‌సాయిరాజ్.. కొరియన్లపై అలవోక విజయానికి బాటలు వేశాడు. నేడు భారత జోడీ టైటిల్ వేటలో బరిలోకి దిగనుంది.