Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) ప్రతినిధిగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ దిలిప్ వెంగ్సర్కార్ ఎన్నికయ్యాడు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో ఇద్దరు ఐసీఏ ప్రతినిధులకు గాను వెంగ్సర్కార్ను ఐసీఏ ఎన్నుకుంది. ఐసీఏ తొలి అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అశోశ్పై వెంగ్సర్కార్ 402-230 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఐసీఏ మహిళా క్రికెటర్ ప్రతినిధిగా మాజీ కెప్టెన్ శుభాగ్ని కులకర్ణి ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ఐసీఏ ప్రతినిధిగా ప్రజ్ఞాన్ ఓజా మరోసారి ఎన్నికయ్యాడు. విజయ్ మోహన్ రాజాపై 396-234 ఓట్ల తేడాతో ఓజా గెలుపొందాడు.