Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం
పారిస్ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలు మరో టైటిల్ ఖాతాలో వేసుకున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో చైనీస్ తైపీ జోడీపై సాత్విక్,చిరాగ్‌లు వరుస గేముల్లో గెలుపొందారు. వరల్డ్ నం.24 చైనీస్ తైపీ జోడీ చింగ్ యావో లు, పో హన్ యంగ్లపై 21-13, 21-19తో సాత్విక్, చిరాగ్ విజయం సాధించారు. భారత షట్లర్లు చెలరేగిన టైటిల్ పోరులో 49 నిమిషాల్లోనే టైటిల్ సాత్విక్ జోడీ సొంతమైంది. తొలి గేమ్‌లో అలవోకగా పైచేయి సాధించారు. రెండో గేమ్‌లో ద్వితీయార్థంలో చైనీస్ తైపీ జోడీ పుంజుకున్నప్పటికీ 19-19 వద్ద వరుస పాయింట్లు సాధించిన సాత్విక్, చిరాగ్ ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ డబుల్స్ విజేతలుగా నిలిచారు.
రూ. 5 లక్షల నజరానా : పతక విజేతలపై భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కాసుల వర్షం కురిపించింది. ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన సాత్విక్, చిరాగ్ జోడీకి రూ. 5లక్షలు ప్రకటించిన బారు.. డబ్ల్యూబిఎఫ్ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన యువ షట్లర్ శంకర్ ముతుస్వామికి సైతం రూ. 5 లక్షల నగదు బహుమతి ప్రకటించింది.