Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోప్యతకు భంగం పట్ల అసహనం
- హోటల్ గది వీడియోపై కోహ్లి సీరియస్
నవతెలంగాణ-పెర్త్ : 'అభిమాన క్రికెటర్లను చూసేందుకు, వారితో కలిసి ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎంతగానో ఉత్సుకత చూపిస్తారు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ వీడియో భయంకరమైనది, నా వ్యక్తిగత భద్రత పట్ల ఆందోళన తీవ్ర ఆందోళన కలిగించింది. నా హౌటల్ గదిలో సైతం నాకు వ్యక్తిగత గోప్యత లేకుంటే ఇంకెక్కడ నాకు పర్సనల్ స్పేస్ లభిస్తుంది? ఇటువంటి అభిమానం నాకు ఏమాత్రం సరికాదు. ఇది వ్యక్తిగత గోప్యతపై దాడి. దయచేసి వ్యక్తిగత గోప్యతను గౌరవించండి, మమ్మల్ని వినోదపు వస్తువుగా చూడకండి' అని విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. విరాట్ కోహ్లి పోస్ట్‌తో క్రికెటర్ల వ్యక్తిగత గోప్యత మరోసారి చర్చకు వచ్చింది. టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు వచ్చిన టీమ్ ఇండియా తొలు త పెర్త్‌లో బస చేసింది.
అక్టోబర్ 8న పెర్త్‌లోని క్రౌన్ టవర్స్ హౌటల్లో బస చేసిన సమయంలో విరాట్ కోహ్లి గదిని హౌటల్ సిబ్బంది వీడియో తీశారు. ఓ సోషల్ మీడియా ఖాతాలో కింగ్ కోహ్లి హౌటల్ గది అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో విరాట్ కోహ్లికి చేరటంతో తాజాగా కోహ్లి స్పందించాడు. దీనిపై బీసీసీఐ అధికారులు క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీకి ఫిర్యాదు చేసింది. విరాట్ కోహ్లి గది వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు వెనుక హౌటల్ సిబ్బంది ఉన్నట్టు క్రౌన్ టవర్స్ మేనేజ్మెంట్ తెలిపింది. విరాట్ కోహ్లికి క్షమాపణలు తెలిపిన హౌటల్ యాజ మాన్యం.. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.