Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంజు శాంసన్‌కు పిలుపు
- కివీస్, బంగ్లా టూర్‌కు జట్ల ఎంపిక
ముంబయి : గుజరాత్ టైటాన్స్‌ను తొలి సీజన్లోనే ఐపీఎల్ విజేతగా నిలిపి తనలోని నాయకుడిని ప్రపంచానికి పరిచయం చేసిన హార్దిక్ పాండ్యకు ఎట్టకేలకు భారత జట్టు పగ్గాలు దక్కనున్నాయి. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ మేరకు చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌కు చోటు దక్కగా..కివీస్‌తో వన్డే, టీ20 జట్లకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ పర్యటనకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్‌కు విశ్రాంతి లభించింది.
భారత టీ20 జట్టు (కివీస్‌తో) : హార్దిక్ పాండ్య (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), గిల్, కిషన్, దీపక్, సూర్యకుమార్, శ్రేయస్, సంజు శాంసన్, వాషింగ్టన్ , చాహల్, కుల్దీప్ , అర్షదీప్, హర్షల్ , సిరాజ్, భువనేశ్వర్ , ఉమ్రాన్ మాలిక్.
భారత వన్డే జట్టు (కివీస్‌తో) : ధావన్ (కెప్టెన్), పంత్ (వైస్ కెప్టెన్), గిల్, దీపక్, సూర్య, శ్రేయస్, సంజు శాంసన్, వాషింగ్టన్, శార్దుల్, షాబాజ్ , చాహల్, కుల్దీప్ , అర్షదీప్ , దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.
భారత వన్డే జట్టు (బంగ్లాతో) : రోహిత్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), ధావన్, కోహ్లి, పటీదార్, శ్రేయస్, త్రిపాఠి, పంత్, ఇషాన్ కిషన్, జడేజా, అక్షర్, వాషింగ్టన్, శార్దుల్, షమి, సిరాజ్, చాహర్, యశ్ దయాల్.
భారత టెస్టు జట్టు (బంగ్లాతో) : రోహిత్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), గిల్, పుజారా, కోహ్లి, శ్రేయస్ , పంత్, భరత్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, శార్దుల్ , షమి, సిరాజ్, ఉమేశ్ యాదవ్.