Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సార్‌బ్రుకెన్(జర్మనీ): హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో భారత జోడీ ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో సాత్త్విక్-చిరాగ్ జోడీ 22-24, 21-15, 21-11తో ఇంగ్లండ్‌కు చెందిన రోరీ ఈస్టన్-జాక్ రస్లపై ఉత్కంఠపోరులో గెలిచారు. 8వ సీడ్ అయిన భారత జోడీ ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ సూపర్-750సిరీస్ డబుల్స్ టైటిల్‌ను నెగ్గిన సంగతి తెలిసిందే. ఇక మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-త్రీషా జోలీ జోడీ 21-18, 21-19తో నెదర్లాండ్స్‌కు చెందిన దెబోరా-ఛెర్లీపై గెలుపొందారు. ఇక మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్స్‌లో ఆకర్షీ కశ్యప్ 13-21, 14-21తో డెన్మార్క్‌కు చెందిన లినే కర్జెఫెడెట్ చేతిలో ఓటమిపాలైంది.