Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిస్ మాస్టర్ టెన్నిస్ టోర్నీ
పారిస్: పారిస్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లోకి టాప్‌సీడ్, స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్ ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్ పోటీలో అల్కరాజ్ 6-1, 6-3 సెట్ల తేడాతో డిమిట్రోవ్(బల్గేరియా)పై వరుససెట్లలో గెలిచాడు. మరో పోటీలో 16వ సీడ్ టఫీ(అమెరికా) 6-3, 7-6(7-5)తేడాతో డి-మేనర్(ఆస్ట్రేలియా)పై గెలుపొందగా.. మరో పోటీలో 7వ సీడ్ రుబ్లేవ్(రష్యా) 4-6, 5-7సెట్ల తేడాతో రూనే(డెన్మార్క్) చేతిలో వరుససెట్లలో ఓడాడు.
డబుల్స్ క్వార్టర్స్‌కు బొప్పన్న జోడీ
పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లోకి భారత్-నెదర్లాండ్స్ జోడీ ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్ పోటీలో రోహన్ బొప్పన్న(భారత్)-మిడెల్కూప్(నెదర్లాండ్స్) జోడీ 6-4, 7-5తేడాతో ఇటలీ జంటపై వరుససెట్లలో గెలిచారు. శుక్రవారం జరిగే క్వార్టర్ఫైనల్లో ఇండో-డచ్ జోడీ 2వ సీడ్ బ్రిటన్-ఫ్రాన్స్ జంటతో తలపడనుంది.