Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్ రేసులోనే పాకిస్తాన్
- దక్షిణాఫ్రికాపై 33పరుగుల తేడాతో గెలుపు
సిడ్నీ: సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు సత్తా చాటింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 185పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 9 ఓవర్లలో 69పరుగులు చేసి 4వికెట్లు కోల్పోయిన అనంతరం వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్ధతిపై దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులకు కుదించగా, ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి కేవలం 108 పరుగులే చేసింది.
ఈ విజయంతో పాక్ సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. పాకిస్తాన్ ఓపెనర్లు రిజ్వాన్(4), బాబర్(6) నిరాశపరిచినా.. హర్రీస్(28), ఇప్తికార్(51), షాదాబ్(52) అర్ధసెంచరీలతో రాణించారు. నవాజ్(28) కూడా ఫర్వాలేదనిపించడంతో ఆ జట్టు భారీస్కోర్ చేసింది. నోర్ట్జేకు నాలుగు, పార్నెల్, రబడా, ఎన్గిడి, షాంసీకి ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో కెప్టెన్, ఓపెనర్ బవుమా(36) రాణించినా.. డికాక్(0), రోషా(7) నిరాశపరిచారు. ఆ తర్వాత మార్క్రరమ్(20), క్లాసెన్(15), స్టబ్స్(18) రాణించినా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. స్పిన్నర్ షాదాబ్ తొలి ఓవర్ తొలి బంతికే బవుమా, మార్క్రరమ్లను ఔట్‌చేసి పాక్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి దక్షిణాఫ్రికా 9 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా... కొత్త టార్గెట్ నేపథ్యంలో 30బంతుల్లో 73 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే ఆ జట్టు లక్ష్యానికి 33 పరుగుల దూరంలో నిలిచిపోయింది. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిదికి మూడు, షాదాబ్‌కు రెండు, నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ వాసిం జూనియర్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షాదాబ్ ఖాన్‌కు లభించింది.
గ్రూప్-2 సెమీస్ రేసు ఇలా..
పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్... జింబాబ్వే చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పాకిస్తాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలవాల్సి ఉంటుంది. అలాకాని పక్షంలో దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్ వర్షంతో రద్ధయినా, ఆ మ్యాచ్‌లో సఫారీజట్టు ఓటమిపాలైనా.. బెటర్ రన్‌రేట్‌తో పాక్ గెలిస్తే సెమీస్‌కు చేరే అవకాశముంది.
స్కోర్‌బోర్డు..
పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (బి)పార్నెల్ 4, బాబర్ (సి)రబడా (బి)ఎన్గిడి 6, హర్రీస్ (ఎల్బి)నోర్ట్జే 28, మసూద్ (సి)బవుమా (బి)నోర్ట్జే 2, ఇప్తికార్ (సి)రోషా (బి)రబడా 51, నవాజ్ (ఎల్బి)షాంసీ 28, షాదాబ్ ఖాన్ (సి)స్టబ్స్ (బి)నోర్ట్జే 52, వాసిం జూనియర్ (సి)బవుమా (బి)నోర్ట్జే 0, నసీమ్ షా (నాటౌట్) 5, హర్రీస్ రవూఫ్ (రనౌట్)క్లాసెన్/బవుమా 3, అదనం 6. (20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 185పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/38, 3/40, 4/43, 5/95, 6/177, 7/177, 8/177, 9/185.
బౌలింగ్: పార్నెల్ 4-0-31-1, రబడా 4-0-44-1, ఎన్గిడి 4-0-32-1, నోర్ట్జే 4-0-41-4, షాంసీ 4-0-36-1
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (సి)రిజ్వాన్ (బి)షాదాబ్ 36, డికాక్ (సి)హర్రీస్ (బి)షాహిన్ షా 0, రోషా (సి)నసీమ్ షా (బి)షాహిన్ షా 7, మార్క్రరమ్ (బి)షాదాబ్ 20, క్లాసెన్ (సి)వాసిం జూ. (బి)షాహిన్ షా 15, స్టబ్స్ (సి)నవాజ్ (బి)నసీమ్ షా 18, పార్నెల్ (ఎల్బి)వాసీం జూ. 3, రబడా (రనౌట్) నవాజ్/రవూఫ్ 1, నోర్ట్జే (సి)హర్రీస్ (బి)రవూఫ్ 1, ఎన్గిడి (నాటౌట్) 4, షాంసీ (నాటౌట్) 1, అదనం 2. (14ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 108పరుగులు.
వికెట్ల పతనం: 1/1, 2/16, 3/65, 4/66, 5/94, 6/99, 7/101, 8/103, 9/103
బౌలింగ్: షాహిన్ షా 3-0-14-3, నసీమ్ షా 3-0-19-1, రవూఫ్ 3-0-44-1, వాసీం జూ. 2-0-13-1, షాదాబ్ ఖాన్ 2-0-16-2, నవాజ్ 1-0-2-0.