Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లా వికెట్ కీపర్ నూరుల్ హసన్ ఆరోపణలు
సిడ్నీ: టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ 'ఫేక్ ఫీల్డింగ్' చేశాడని, దానికి అంపైర్లు తమ జట్టుకు ఐదు బోనస్ పరుగులు ఇచ్చి వుంటే ఫలితం వేరేలా ఉండేదని బంగ్లాదేశ్ బ్యాటర్ నురుల్ హసన్ ఆరోపించాడు. ఆర్ష్‌దీప్ వేసిన చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సిన తరుణంలో నురుల్ సిక్స్, ఫోర్ బాది బంగ్లా జట్టులో ఆశలు రేపాడు.
కానీ చివరి నాలుగు బంతులను కట్టుదిట్టంగా వేయడంతో బంగ్లా జట్టు ఆ ఓవర్లో 14పరుగులే చేయగల్గింది. ఈ క్రమంలో బంగ్లా వికెట్ కీపర్, బ్యాటర్ నూరుల్ హసన్ స్పందిస్తూ.. ఫీల్డ్ అంపైర్లు క్రిస్ బౌన్, మరైస్ ఎరాస్మస్లకు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో కూడా తెలియదని, అసలు దాని గురించి వారు పట్టించుకోలేదని పరోక్షంగా ఆరోపించారు. ఈ సంఘటన మ్యాచ్ 7వ ఓవర్లో జరిగిందని నూరుల్ తెలిపారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
ఐసిసి రూల్ 41.5 ప్రకారం బ్యాటర్ పరుగు తీసే సమయంలో ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా మోసం చేసినట్లు, అవరోధం కల్పించ కూడదు. ఒక వేళ ఈ నిబంధన ఉల్లంఘించినట్లు అంపైర్లు గుర్తిస్తే బ్యాటింగ్ చేసే జట్టుకు అదనంగా ఐదు పరుగులు ఇచ్చే అవకాశం ఉంది.
అలానే సదరు బంతిని డెడ్‌గా ప్రకటిం చొచ్చు. అలాగే 28.2.3 రూల్ ప్రకారం.. ఫీల్డర్ అన్యాయంగా వ్యవహరించాడని అంపైర్లు గుర్తిస్తేనో బాల్ కూడా ఇవ్వొచ్చు. బ్యాటింగ్ జట్టుకు ఐదు పరు గులను ఇచ్చే విషయంలో తుది అధికారం ఫీల్డ్ అంపైర్లదే. అయితే ఫీల్డర్ ఇలా చేశాడని బ్యాటర్ సదరు అంపైర్ దష్టికి తీసుకెళ్లే హక్కు ఉంది.
ఫీల్డ్ అంపైర్లు చర్చించి.. అవసరమైతే పైస్థాయిలో ఉండే వారికి నివేదించి చర్యలు తీసుకొంటారు. కానీ, భారత్-బంగ్లా మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ చేస్తున్న బ్యాటర్ కానీ.. ఫీల్డ్ అంపైర్లు కానీ విరాట్ తప్పు చేసినట్లు పరిగణించలేదు.