Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైలో ఓపెన్ బ్యాడ్మింటన్
సార్బ్రూకెన్ (జర్మనీ) : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోరుకు హైలో ఓపెన్‌లో తెరపడింది. ఫ్రెంచ్ ఓపెన్ విజయంతో హైలో ఓపెన్‌లో అడుగుపెట్టిన సాత్విక్, చిరాగ్ జోడీ.. ఇక్కడ పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లోనే పరాజయం చవిచూసింది. ఇంగ్లాండ్ షట్లర్లు బెన్ లేన్, సీన్ వెండీలతో మెన్స్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో 17-21, 14-21తో వరుస గేముల్లో సాత్విక్, చిరాగ్‌లు సెమీఫైనల్స్ బెర్త్‌ను కోల్పోయారు. తొలి గేమ్‌లో 13-8తో మంచి ఆధిక్యంలో నిలిచిన సాత్విక్, చిరాగ్ జోడీ అలవోక విజయం సాధించేలా కనిపించారు. కానీ ఇంగ్లాండ్ ద్వయం వరుసగా ఆరు పాయింట్లు సాధించి మ్యాచ్ గమనాన్ని మలుపు తిప్పింది. 21-17తో 16 నిమిషాల్లోనే తొలి గేమ్ ఇంగ్లాండ్ జోడీ వశమైంది. రెండో గేమ్‌లో విరామ సమయానికి 7-11తో వెనుకంజలో నిలిచిన సాత్విక్, చిరాగ్ ఎక్కడా కోలుకోలేదు. 18 నిమిషాల్లో రెండో గేమ్ గెల్చుకున్న ఇంగ్లాండ్ షట్లర్లు సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకున్నారు. మహిళల డబుల్స్‌లో గాయత్రి, ట్రెస జంట చైనీస్ తైపీ జంట చింగ్, లిన్ వాన్లపై 21-17, 18-21, 21-8తో గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించింది.