Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో ఇంగ్లాండ్
సిడ్నీ : డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా ఖేల్ ఖతం. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. గ్రూప్-1 చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ సెమీఫైనల్లో కాలుమోపింది. గ్రూప్-1లో అగ్రస్థానంతో న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్ నిశాంక (67, 45 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీతో భారీ స్కోరుకు గట్టి పునాది వేసినా.. మిడిల్ ఆర్డర్ సద్వినియోగం చేసుకోలేదు. భానుక రాజపక్స (22, 22 బంతుల్లో 3 ఫోర్లు) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. డిసిల్వ (9), అసలంక (8), శనక (3), హసరంగ (9), కరుణరత్నె (0), తీక్షణ (0) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ (3/26) రాణించాడు. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో ఛేదించింది. టాప్-3 బ్యాటర్లు అలెక్స్ హేల్స్ (47), బెన్ స్టోక్స్ (42 నాటౌట్), జోశ్ బట్లర్ (28) రాణించటంతో ఛేదన సులువైంది. శ్రీలంక బౌలర్లు కుమార (2/23), హసరంగ (2/23), డిసిల్వ (2/24) రెండేసి వికెట్లతో మెరిశారు. ఆదిల్ రషీద్ (1/16) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.