Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జింబాబ్వేపై విజయంతో గ్రూప్-2లో అగ్రస్థానం
మెల్బోర్న్ : 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం మెల్బోర్న్లో జింబాబ్వేతో జరిగిన గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో 71 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించిన భారత్ సూపర్12 గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచింది. నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించిన టీమ్ ఇండియా అగ్రస్థానంతో దర్జాగా సెమీస్‌కు చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ (61 నాటౌట్, 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (51, 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో తొలుత భారత్ 186/5 పరుగుల భారీ స్కోరు చేసింది. బౌలర్లు అశ్విన్ (3/22), మహ్మద్ షమి (2/14), హార్దిక్ పాండ్య (2/16) విజృంభించటంతో ఛేదనలో జింబాబ్వే 115 పరుగులకే కుప్పకూలింది. నవంబర్ 10న రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది.