Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాదేశ్‌పై మెరుపు విజయం
ఆడిలైడ్ : దక్షిణాఫ్రికా పరాజయం.. పాకిస్థాన్‌కు వరమైంది. ఆశల్లేని ప్రపంచకప్‌లో పాక్ ఏకంగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన పాకిస్థాన్ గ్రూప్-2లో మూడో విజయంతో (ఆరు పాయింట్లు) సెమీస్ బెర్త్ సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 127 పరుగులు చేసింది. నజ్ముల్ (54, 48 బంతుల్లో 7 ఫోర్లు), సర్కార్ (20), అఫిఫ్ (24)లు రాణించారు. షకిబ్ (0)ను థర్డ్ అంపైర్ ఎల్బీ అవుట్ ఇవ్వటం మ్యాచ్‌లో వివాదాస్పదమైంది. నాటౌట్ అని స్పష్టంగా కనిపిస్తున్నా మూడో అంపైర్ ఈ తప్పిదం చేయటం సర్వత్రా చర్చనీయాంశమైంది. స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్ 5 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. మహ్మద్ హరీశ్ (31), మసూద్ (24), రిజ్వాన్ (32), బాబర్ (25) రాణించారు. షహీన్ షా అఫ్రిది (4/22) 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.