Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
ఆడిలైడ్ : ఐసీసీ ప్రపంచకప్‌తో దక్షిణాఫ్రికా భగ్న ప్రేమ కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ బెర్త్ చేతుల్లో ఉండగా.. సఫారీలు స్వయంకృతంతో వదిలేశారు. ఆడిలైడ్‌లో ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాఅనూహ్య పరాజయం చవిచూసింది. సంచలన ప్రదర్శన చేసిన డచ్ ఆటగాళ్లు 13 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. స్టీఫెన్ (37, 30 బంతుల్లో 7 ఫోర్లు), మాక్స్ (29, 31 బతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), టామ్ కూపర్ (35, 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కొలిన్ అకర్‌మ్యాన్ (41 నాటౌట్, 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఊరించే ఛేదనలో దక్షిణాఫ్రికా అనూహ్య పరాజయం పాలైంది. డికాక్ (13), బవుమా (20), రొసో (25), మార్కరం (17), క్లాసెన్ (21)లు మంచి ఆరంభాలను గెలుపు ఇన్నింగ్స్‌లుగా మల్చలేకపోయారు. డెవిడ్ మిల్లర్ (17, 17 బంతుల్లో 1 ఫోర్) క్రీజులో ఉండగా సఫారీలు ఫేవరేట్‌గా కనిపించారు. కానీ వాన్‌డర్ మెర్వె కండ్లుచెదిరే క్యాచ్‌తో మిల్లర్ ఇన్నింగ్స్ ముగియగా... అక్కడ్నుంచి మ్యాచ్‌పై డచ్ జట్టు పట్టు బిగించింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు సఫారీలు 145 పరుగులే సాధించారు. డచ్ బౌలర్లలో గ్లోవర్ (3/9), క్లాసెన్ (2/20), లీడె (2/25)లు రాణించారు. సంచలన విజయం నమోదు చేసిన నెదర్లాండ్స్.. తర్వాతి టీ20 ప్రపంచకప్‌కు నేరుగా సూపర్12 దశకు అర్హత సాధించింది. బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్, జింబాబ్వే సహా ఐర్లాండ్‌లు అర్హత టోర్నీ ఆడాల్సి ఉంటుంది.