Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత స్టార్ గోల్ఫర్ ఉదయన్ మానె
హైదరాబాద్ : గోల్ఫ్ క్రీడకు హైదరాబాద్లో మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో ఇక్కడ పెద్దగా టోర్నీలు లేవు. కానీ ఇప్పుడు ప్రతి ఏడాది జాతీయ టోర్నీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. గోల్ఫ్ కోర్టు సైతం ప్రపంచశ్రేణి సదుపాయాలతో సిద్ధం చేశారు. కొత్తగా ముస్తాబు చేసిన గోల్ఫ్ కోర్టులో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా చూస్తున్నాను' భారత స్టార్ గోల్ఫర్ ఉదయన్ మానె అన్నారు. తెలంగాణ మాస్టర్స్ 8వ సీజన్ సందర్భంగా హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఫెండింగ్ చాంపియన్ మను గండాస్తో కలిసి ఉదయన్ మానె మాట్లాడారు. తెలంగాణ మాస్టర్స్ టోర్నీ నవంబర్ 9 నుంచి ఆరంభం కానుంది. నవంబర్ 12న ఫైనల్స్ జరుగుతాయి. విజేతకు రూ.40 లక్షల భారీ నగదు బహుమతి అందివ్వనున్నారు.