Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెయిల్ నిరాకరించిన సిడ్నీ కోర్టు
సిడ్నీ : లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలతో కటకటాలపాలైన శ్రీలంక క్రికెటర్ ధనుశ్ గుణతిలకను అన్ని స్థాయిల క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) సోమవారం నిర్ణయం తీసుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన గుణతిలక తొలి రౌండ్ మ్యాచుల అనంతరం తొడ కండరం గాయంతో సూపర్12 పోరుకు దూరమయ్యాడు. ఈ సమయంలో ఆన్లైన్ డేటింగ్ యాప్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకున్న గుణతిలక.. సిడ్నీ ఈస్ట్‌లోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో సదరు యువతి (29)తో అసభ్యంగా ప్రవర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. యువతి సమ్మతి లేకుండానే ఆమెతో లైంగికంగా కలిసిన గుణతిలకను సిడ్నీ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గుణతిలకను పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా.. సిడ్నీ కోర్టు బెయిల్ నిరాకరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో గుణతిలకను క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.