Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం వెల్లడి
హైదరాబాద్ : మరో మెగా టెన్నిస్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కానుంది. హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం (హెచ్ఓటీఏ) ఆధ్యర్వంలో నవంబర్ 10-13 వరకు సికింద్రాబాద్ క్లబ్ వేదికగా ఆల్ ఇండియా మాస్టర్స్ కేటగిరీ నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం సోమవారం టోర్నీ బ్రోచర్ విడుదల చేసింది. రూ.2 లక్షల నగదు బహుమతి అందిస్తోన్న ఆల్ ఇండియా మాస్టర్స్ టోర్నీలో 300 మందికి పైగా క్రీడాకారులు పోటీపడనున్నారు. 30 ప్లస్ నుంచి 70 ప్లస్ వరకు పలు కేటగిరీల వారీగా సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలను అంతర్జాతీయ టెన్నిస్ రూల్స్ ప్రకారం జరుగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. డిఐజి ఎస్. చంద్రశేఖర్ రెడ్డితో కలిసి హెచ్ఓటీఏ అధ్యక్షుడు డాక్టర్ నంద్యాల నరసింహారెడ్డి ఈవెంట్ బ్రోచర్ విడుదల చేశారు. నవంబర్ 10న అర్హత మ్యాచులు జరుగనుండగా.. ఆ తర్వాతి రోజు నుంచి ప్రధాన టోర్నీ నిర్వహించనున్నారు.