Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా విరాట్
దుబాయ్ : క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి విరామం అనంతరం ఐసీసీ అవార్డు అందుకున్నాడు. అక్టోబర్ నెలలో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లి.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (అక్టోబర్)గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ సూపర్12 గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అజేయంగా 82 పరుగుల ఇన్నింగ్స్ నమోదు చేసిన కోహ్లి.. విమర్శకుల ప్రశంసలు సైతం పొందాడు. సికందర్ రజా, డెవిడ్ మిల్లర్ సైతం రేసులో నిలిచినా అభిమానులు, ప్యానల్ కోహ్లికి ఓటేశారు. 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫర్ అక్టోబర్ అవార్డు అందుకోవటం గొప్ప గౌరవం. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, అవార్డు ప్యానల్ కలిసి ఎంచుకోవటం మరింత ప్రత్యేకం. అవార్డు రేసులో నిలిచిన ఇతర ఆటగాళ్లకు సైతం అభినందనలు' అని విరాట్ కోహ్లి తెలిపాడు.