Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెలుపోటములతో సంబంధం లేకుండా రాణించాలి
- నాగార్జున వర్సిటీలో రెవెన్యూ క్రీడా, సాంస్కృతిక ఉత్సవాల ప్రారంభ సభలో వక్తలు
గుంటూరు: పని ఒత్తిడి నుండి బయట పడాలంటే ప్రతి రోజు వ్యాయామ క్రీడల్లో పాల్గొనాలని వక్తలు సూచించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా 6వ రాష్ట్ర రెవెన్యూ క్రీడా, సాంస్కతిక ఉత్సవాలు-2022 శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎపిఆర్ఎస్ఎ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవంలో క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం అతిధులు పావురాలు ఎగురవేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడలు, యువజన సేవల ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్ మాట్లాడుతూ ఈ మూడ్రోజులు క్రీడా పోటీల్లో పాల్గొనడమే కాకుండా ప్రతి రోజు ప్రావీణ్యమున్న క్రీడలు ఆడటంవల్ల ఒత్తిడి నుండి ఉపసమనము పొందవచ్చునని పేర్కొన్నారు. అంతర్జాతీయ షటిల్ బ్యాట్మింటన్ క్రీడాకారిణి, డిప్యూటీ కలెక్టర్ పివి సింధు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని, ఒత్తిడిని జయించడానికి క్రీడలను ఆడాలని అన్నారు. శాప్ ఎండి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రెవెన్యూ క్రీడలు నిర్వహించడము అభినందనీయమన్నారు.