Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొ కబడ్డీ సీజన్-9
పూణే: ప్రొ కబడ్డీ సీజన్-9లో యుపి యోథా జట్టు విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోటీలో యుపి యోథా జట్టు 40-34పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది. యుపి జట్టులో సురేందర్ గిల్(11పాయింట్లు), పర్దీప్ నర్వాల్(8) రైడ్స్‌లో రాణించగా.. ఆషు సింగ్(4), రోహిత్(4) ట్యాకిల్స్‌లో మెరిసారు. ఇక హర్యానా జట్టులో మంజిత్(12), ప్రపంజన్(8) రెడ్స్లో మెరిసాన.. జైదీప్(6) మాత్రమే ట్యాకిల్స్‌లో రాణించాడు. ఇక యుపి జట్టు 4సార్లు హర్యానాను ఆలౌట్ చేస్తే.. హర్యానా జట్టు కేవలం 2సార్లు మాత్రమే యుపి యోథాను ఆలౌట్ చేయగల్గింది. ట్యాకిల్స్‌లో 4పాయింట్లు, ఆలౌట్ చేయడం ద్వారా 4పాయింట్లు సాధించి యుపి జట్టు విజయం సాధించింది.